VZM: జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాలతో డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రధాన కూడళ్లలో అధిక మలుపుల వద్ద ఏపుగా పెరిగిన తుప్పలను జేసీబీ సహాయంతో శనివారం స్థానిక ఎస్సై సన్యాసినాయుడు దగ్గర ఉండి తొలగించారు. ఏపుగా పెరిగిన తుప్పలు వలన ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.