ఆస్ట్రేలియా మహిళా జట్టులోని ఇద్దరు మహిళా క్రికెటర్లను ఓ ఆకతాయి వేధించినట్లు తెలుస్తోంది. అయితే, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇండోర్ రాడిసన్ బ్లూ హోటల్ గది నుంచి కెఫేకు తమ ప్లేయర్లు నడిచివెళ్తుండగా నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు జట్టు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడు అకీల్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.