KMM: మధిర నియోజకవర్గం BRS పార్టీ ఇంఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పుట్టినరోజు సందర్భంగా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో శనివారం BRS పార్టీ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువకులు అధిక సంఖ్యలో పాల్గొని 55 మంది రక్తదానం చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వారు అన్నారు.