RR: SGF స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్-14లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన క్రీడలలో కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. లాస్య వర్ధిని వాలిబాల్లో, సాయి వర్షిత్ లాంగ్ జంప్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై పథకాలు సాధించారు. దీంతో విద్యార్థులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందించారు. క్రీడల్లో ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నారు.