‘జటాధర’పై నిర్మాత శివిన్ నారంగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ విడుదలయ్యాక క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారని, మూడు రోజులు బ్రేక్ లేకుండా నిరంతరం దీని షూటింగ్ జరిగిందని చెప్పారు. అదే మూవీకి హైలైట్గా నిలుస్తుందన్నారు. రెండు శక్తివంతమైన శక్తులు ఢీకొంటే ఎలా ఉంటుందో ఎంతో తెరపై చూస్తారని, ఇప్పటివరకూ ఏ మూవీకి కూడా ఇలాంటి క్లైమాక్స్ లేదన్నారు.