RR: హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి బ్లడ్ బ్యాంక్ కాలనీలో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు వీధుల్లో త్రీఫేస్ కరెంట్ లేనందు వల్ల తరచూ ఎలక్ట్రానిక్ పరికరాలు రిపేర్ అవుతున్నాయని కాలనీవాసులు తెలపడంతో అవసరమైన చోట ఇంటర్నల్ పోల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.