మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడారు. ఇంత సీరియస్గా జరుగుతున్న సమావేశంలో హవేలీ ఘనపూర్ ఎమ్మార్వో సింధూ రేణుక ఫోన్ వాడుతున్నారు.