MBNR: హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ విజయేందిర బోయి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల స్థితిగతులను, పదో తరగతి విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల సమయపాలనపై ఆరా తీశారు. విద్యార్థులు కష్టపడి చదివి 100% ఉత్తీర్ణత సాధించాలని, క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని ఆమె సూచించారు.