SKLM: సారవకోట మండలం వడ్డీనవ గ్రామంలో 104 వాహనం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు గ్రామస్తులకు పరీక్షల నిర్వహించి, అవసరమైన వారికి మందులను సరఫరా చేశారు. సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా గ్రామస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.