HYD: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో భేటీ అయ్యారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టి.పి.టి.ఛార్జీల విడుదల, రక్షణ శాఖ భూముల ఎక్స్ఛేంజ్ గురించి చర్చించారు. త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరించి ప్రజలకు తీపి కబురు అందిస్తామని సీఎస్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.