GDWL: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గద్వాలలో గురువారం ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించారు. దాదాపు 600 మంది పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గద్వాల జిల్లా అదనపు ఎస్పీ కె. శంకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోలీసుల విధులు, వారు ఉపయోగించే ఆయుధాలు విద్యార్థులు పరిశీలించారు.