KRNL: బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.