AP: కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘చాలా మంది ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విచారకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలి. ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు.