AP: బస్సు ప్రమాద ఘటనపై Dy.CM పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు BJP చీఫ్ మాధవ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ.. ఘటన స్థలం వద్దే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.