AP: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై CM చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల రవాణా శాఖ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని తెలిపారు. ప్రైవేటు బస్సుల ఫిట్నెస్, సేఫ్టీపై తనిఖీలు చేయాలన్నారు. అన్ని జిల్లాల్లో బస్సుల తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలుంటాయన్నారు.