HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ల దాఖలు, పరిశీలన, విత్ డ్రా ప్రక్రియ పూర్తయింది. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లని వాటిగా తేలాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన తర్వాత 81 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇవాళ 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు.