GNTR: తెనాలి మండలంలోని రైతులు, కౌలు రైతులు రేపు సాయంత్రంలోగా ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి సుధీర్ బాబు సూచించారు. రేపటితో గడువు ముగుస్తున్నందున రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. ఈ-క్రాప్ నమోదు ద్వారానే ప్రభుత్వం అందించే రాయితీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రయోజనాలు పొందవచ్చని ఆయన తెలిపారు.