కోనసీమ: కూటమి పాలనలో రాష్ట్రాభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్‌కు గూగుల్ వచ్చిందని, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఇవన్నీ చూసి వైసీపీ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు.