సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో మల్టీస్టారర్‌ను దివంగత నటుడు కృష్ణం రాజు ప్లాన్ చేశారట. దర్శకుడు మురుగదాస్ వారి కోసం కథను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వారిద్దరూ ఇతర మూవీలతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందట. దీంతో ఇప్పుడు ఈ కాంబోలో మూవీ వస్తే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.