GNTR: రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్మాణాలకు అనువుకాని ప్రాంతాల్లో స్థలాలను ఇచ్చి ప్రజలకు గుదిబండల్లా మార్చడం జరిగిందని పేర్కొన్నారు.