KRNL: కల్లూరు మండలం పర్ల గ్రామంలో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా చిన్న వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామ ప్రజల రాకపోకలు అంతరించాయి, రోజువారీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. పక్క గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులు పాఠశాలలకు సమయానికి చేరుకోలేకపోతుండగా, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.