ప్రకాశం: ఇంటి పన్నుల చెల్లింపులు స్వర్ణ పంచాయితీ పోర్టర్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని డీఎల్డీవో శ్రీనివాసులు రెడ్డి అన్నారు. సీఎస్ పురంలోని ఒకటో సచివాలయాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా చేపట్టిన ఇంటి పన్నులు చెల్లింపులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.