TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా యూసుఫ్ గూడా డివిజన్ కృష్టానగర్ బ్లాక్-3లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు. ప్రచారంలో మంత్రి పొన్నం ఆటోలో ప్రయాణించారు. మంత్రి పక్కన ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ కూర్చున్నారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ఆటో డ్రైవర్లకు భరోసా కల్పించారు.