NZB: జిల్లాలో పలు చోట్ల వర్ష సూచన ఉన్నందున మోస్రా మండలంలోని అన్ని సెంటర్లలో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్ కప్పి జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ రాజశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. అదే విధంగా కంటా వేసిన ధాన్యం వెంటనే మిల్లులకు పంపించాలన్నారు. ధాన్యాన్ని తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.