RR: సరూర్ నగర్లోని త్యాగరాయనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి విషాదకర ఘటన జరిగింది. MSR రెసిడెన్సీలో నివసించే మాధవి అనే మహిళ మంటల్లో కాలిపోయింది. మాధవి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి బయటకు వెళ్లి తిరిగి వచ్చి స్టవ్ వెలిగించడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆమె ఆర్తనాదాలు చేస్తూ అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.