KMR: బీబీపేట బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 1950వ సంవత్సరం నాటి ఈ బస్టాండ్ గోడలు కూలిపోయే స్థితికి చేరుకోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు భయపడుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కామారెడ్డి, దుబ్బాక, సిరిసిల్ల వంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచే ప్రయాణాలు చేస్తుంటారు. ప్రమాదం జరగకముందే అధికారులు నూతన బస్టాండ్‌ను నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.