W.G: నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడపలో ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామికి శనివారం చెరకు ముక్కలుతో ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారు జామున ఆలయ అర్చకులు అరుణ్ కుమార్ స్వామి వారికి సుప్రభాత హారతి ఇచ్చారు. కార్తీక మాసం, నాగులచవితి సందర్భంగా వేకువజామున నుంచే భక్తులు దర్శనానికి తరలివచ్చారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.