VZM: నాగులచవితి సందర్భంగా శనివారం జామి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఉన్న నాగేంద్రడు పుట్ట వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి దూప దీపాలుతో నాగేంద్రనికి పూజలు నిర్వహించారు. నాగుల చవితి రోజు నాగులను పూజించడం వలన కుజ దోషం, కాలసర్ప దోషం, కళత్ర దోషం లాంటివి తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయని ఆలయం అర్చకులు సాయి శర్మ భక్తులకు వివరించారు.