RR: షాద్నగర్ టోల్ ప్లాజా వద్ద ఈరోజు RTA అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. జాతీయ రహదారిపై వివిధ పట్టణాల నుంచి వస్తున్న బస్సులను, వాహనాలను ఆపి, వాటి పత్రాలను పరిశీలించారు. సరైన నిబంధనలు పాటించని, అనుమతులు లేని బస్సులపై అధికారులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.