RR: మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ఓ వాహనం బ్రేక్ డౌన్ కావడంతో పెట్రోలింగ్ వాహనం ఆపి వాహనానికి మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో పెట్రోలింగ్ వాహనాన్ని కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.