WGL: జిల్లా కేంద్రంలోని బల్దియ కార్యాలయంలో శనివారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సాస్కి పథకం కింద పురాతన కట్టడాలు, బావుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధిలో ఈ పథకం కీలకమని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.