ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం శనారసింహ స్వామి వారికి పల్లకి సేవా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులుకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షులు కుందురు తిరుపతి రెడ్డి భక్తులు పాల్గొన్నారు.