MDK: గ్రామీణ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో చెందిన యువతకు 15 రోజులపాటు ఉచిత శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.