ప్రకాశం: కనిగిరి తహసీల్దార్ రవిశంకర్‌ను జిల్లా కలెక్టర్ రాజాబాబు సస్పెండ్ చేశారు. ఇటీవల కనిగిరి మండలంలో భూ ఆక్రమణలకు పాల్పడే వారికి సహకరించడంతో పాటు, ప్రభుత్వ భూముల విషయంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై విచారణ జరిపించిన కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. మరి కొంతమంది వీఆర్వోలను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.