ఆస్ట్రేలియాలో మూడో వన్డే కోసం ప్రకటించిన తుది జట్టులో నితీశ్ కుమార్ రెడ్డి పేరు లేదు. దీంతో ఎందుకు అతడిని పక్కన పెట్టారు? అనే సందేహం మొదలైంది. ఈ క్రమంలో నితీశ్ గాయంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. ‘రెండో వన్డే సందర్భంగా నితీశ్ ఎడమ తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో మూడో వన్డే సెలక్షన్ కోసం అతడు అందుబాటులో లేడు. మెడికల్ టీం పర్యవేక్షిస్తోంది’ అని వెల్లడించింది.