సత్యసాయి: పెనుకొండ మండలంలో శనివారం ఆడదాకులపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించడంలో ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రీన్ శ్రీ సత్యసాయి జిల్లాగా మార్చడానికి అందరూ సహకరించాలన్నారు.