SRCL: మైనారిటీ యువతి, యువకుల నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి భారతి తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ముస్లిం, బౌద్ధ, పార్శి, సిక్కు, జైనుల యువత, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.