W.G: మొగల్తూరు మండలం ఆంబోతుతిప్పలోని సుబ్బారాయుడు ఆలయం వద్ద నాగులచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం తెల్లవారుజాము నుంచి పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి పుట్టలో పాలు పోసి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పసలదీవి శ్రీ కనకదుర్గమ్మ భజన భక్తులను ఆకట్టుకుంది. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.