ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి చాగల్లు రిజర్వాయర్ నుంచి పెన్నా నది, పెండేకల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. అనంతరం జలహారతి ఇచ్చారు. ప్రస్తుతం చాగల్లు నుంచి 460 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, పెన్నాకు 250, పెండేకల్లుకు 200 క్యూసెక్కులు నీరు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. నీటి విడుదలతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.