ASF: జిల్లాలో దివ్యాంగ పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు పింఛన్ పునరుద్ధరణ కొరకు ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ASF జిల్లా అదనపు కలెక్టర్, గ్రామీణ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు.