PPM: గరుగుబిల్లి మండలంలోని పలు గ్రామాల్లో నాగుల చవితిని ప్రజలు శనివారం జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఆయా గ్రామాల సమీపంలో ఉన్న పంట పొలాల్లో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి నాగేంద్రునికి పువ్వులు, వస్త్రాలు, పాలు, గుడ్లు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అక్కడే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.