ప్రకాశం: తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని శనివారం ఉదయం రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనానికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులందరూ స్వామి వారి ఆశీస్సులు తీసుకుని బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు.