KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకాపురి కాలనీలో పటాన్ సల్మా (29) అనే మహిళ కూల్ డ్రింక్‌లో కలుపు మందు కలిపి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఖమ్మం, ఆపై వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున సల్మా మృతి చెందింది.