VZM: కొత్తవలస పట్టణ కేంద్రానికి చెందిన జుత్తాడ సాగర్ ఇటీవల ఆనారోగ్యంతో మృతిచెందాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన చెక్కును అతని తల్లి రమణమ్మ శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ. 1,50,000 చెక్కును ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శనివారం అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందన్నారు.