ASR: విద్యార్థులు గంజాయి, సిగరెట్టు, మద్యం వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జీ.మాడుగుల సీఐ బీ.శ్రీనివాసరావు సూచించారు. గంజాయి నిర్మూలనకు సహకరించాలని కోరారు. ఎవరైనా అలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు వెంటనే సమాచారం అందించాలన్నారు. శనివారం ఎస్సై షణ్ముఖరావుతో కలిసి జీఎం కొత్తూరు ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులతో సమావేశమయ్యారు.