ELR: నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో ఏప్రిల్ 24వ తేదీన మీర్జాపురం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ జ్యోతి మెడలోని నానుతాడు గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయవాడలో నిందితుడిని అదుపులోకి తీసుకొని 22 గ్రాముల బంగారు నానుతాడు బాధితురాలికి శనివారం అందించారు. బాధిత కుటుంబం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.