NZB: డిచ్పల్లి మండలం ధర్మారం (బి) వద్ద ఓ కంటైనర్ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి పార్సిళ్లతో నిజామాబాద్‌కు వస్తున్న కంటైనర్ శనివారం వేకువ జామున 5 గంటల సమయంలో బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.