RR: ఏదైనా బస్సులో ప్రమాదం జరిగితేనే ఆర్టిఏ తూతూ మంత్రంగా తనిఖీలు చేపడతారని షాద్నగర్ నియోజకవర్గం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కన్వీనర్ శీను నాయక్ విమర్శించారు. వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులు, తదితర వాటిపై రెగ్యులర్ పర్యవేక్షణ చేసి ప్రజా నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.