KKD: శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో పాస్టర్స్ ఫెలోషిప్ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దైవ కార్యక్రమాల కోసం ఏర్పడిన ఈ కొత్త ఫెలోషిప్ పాత ఫెలోషిప్ సభ్యుల అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుని, సమాజ సేవలో మరింత సమగ్రంగా ముందుకు సాగాలి అని ఆయన సూచించారు.