SRD: పదోతరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజు షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించినట్లు కంగ్టి మండల విద్యాశాఖ అధికారి రహీమొద్దీన్ శనివారం తెలిపారు. రూ.125తో నవంబర్ 13 వరకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా చెల్లించవచ్చన్నారు. రూ.500 అదనపు రుసుముతో డిసెంబర్ 29 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు.